ఆలూర్‌లో ఒకరి దారుణ హత్య
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. ఆలూర్‌కు చెందిన గొల్ల పెద్ద గంగాధర్(46) గురువారం అర్ధరాత్రి ఇంటి ఆరుబయట నిద్రించాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధాలతో అతడిని కొట్టి చంపారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి చెల్లి అంజలి తన చిన్న అన్నపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపడుతామని ఎస్‌హెచ్‌వో తెలిపారు.


