బోల్తాపడిన కారు | - | Sakshi
Sakshi News home page

బోల్తాపడిన కారు

Dec 6 2025 7:29 AM | Updated on Dec 6 2025 7:29 AM

బోల్త

బోల్తాపడిన కారు

బోల్తాపడిన కారు తాళం వేసిన ఇంట్లో చోరీ కరెంట్‌షాక్‌తో ఆవు మృతి అనారోగ్యంతో మాజీ సీఐ మృతి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బంజర వద్ద శుక్రవారం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. వివరాలు ఇలా.. బోధన్‌కు చెందిన సుబ్బారావు, సుజాత అనే వృద్ధదంపతులు శుక్రవారం వారి బ్రీజా కారులో బోధన్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. కారు బంజర సమీపంలోకి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డుకిందకు దూసుకుపోయి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వృద్ధ పతులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకిందకు దూసుకుపోయి బోల్తాపడడం వల్ల కారు అద్దాలు పగిలిపోవడంతోపాటు పలు చోట్ల ధ్వంసమయింది.

బాల్కొండ: మండలంలోని ఇత్వార్‌పేట్‌గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాల్కొండ ఎస్సై శైలెంధర్‌ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బొండ లక్ష్మీ గురువారం ఇంటికి తాళం వేసి తల్లిగారి ఇంటికి వవెళ్లిందిె. గుర్తు తెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి వచ్చి ఇంటి తాళం పగుల గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 5 గ్రాముల బంగారు కమ్మలు, రూ. 3వేల నగదు ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం బాధితురాలు చోరీని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామశివారులో శుక్రవారం ఆవు ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌తో మృతిచెందింది. గ్రామంలోని శశాంక్‌రెడ్డికి చెందిన ఆవుల మంద రోజూలాగే శుక్రవారం మేత కోసం గ్రామశివారుకు వెళ్లింది. మందలోని ఓ ఆవు గ్రామశివారులోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై, అక్కడిక్కడే మృత్యువాతచెందింది. ప్రమాదంలో మృతిచెందిన ఆవు విలువ సుమారు రూ.70వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. బాధితుడికి ట్రాన్స్‌కో తరపున తగిన నష్టపరిహారం చెల్లించాలని వారు కొరుతున్నారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన మాజీ సీఐ సారా సత్యనారాయణ గౌడ్‌ (72) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సత్యనారాయణగౌడ్‌ 7వ బెటాలియన్‌లో ఎస్సై, సీఐగా పనిచేశారు. అలాగే గౌడసంఘం అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు తాడ్వాయిలో జరిగాయి. ఆయనకు భార్య దేవేంద్ర, కుమారుడు మరళీమోహన్‌గౌడ్‌ ఉన్నారు.

బోల్తాపడిన కారు
1
1/2

బోల్తాపడిన కారు

బోల్తాపడిన కారు
2
2/2

బోల్తాపడిన కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement