కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ | - | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ

Dec 6 2025 7:29 AM | Updated on Dec 6 2025 7:29 AM

కేంద్

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు ఘనంగా ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే

సుభాష్‌నగర్‌: ఢిల్లీలోని పార్లమెంట్‌ ప్రాంగణంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను శుక్రవారం నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వచ్చిన ప్రభుత్వ టీచర్లకు టెట్‌ తప్పనిసరి నిర్ణయంపై కేంద్రమంత్రికి లేఖ అందజేశారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3వేల మంది ఉపాధ్యాయులపై ఈ టెట్‌ తప్పనిసరి ప్రభావం చూపుతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించి, చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆయన కోరారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు శుక్రవా రం ప్రశాంతంగా కొనసాగాయని అకడమిక్‌ ఆడి ట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 30 పరీక్ష కేంద్రాలలో 3,883 మంది విద్యార్థులకు గాను 3,633 మంది హాజరు కాగా 250 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు. ఉదయం జరిగిన 2వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 706 మందికి గాను 648 మంది హాజరు కాగా 58 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన 3వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 4వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 3,177 మందికి గాను 2,985 మంది హాజరు కాగా 192 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. నిజామాబాద్‌, కామా రెడ్డి జిల్లాలలోని పలు పరీక్ష కేంద్రాలను ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ అతిక్‌ సుల్తాన్‌ తనిఖీ చేశారు.

కమ్మర్‌పల్లి: మండలంలోని చౌట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాని కి ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తున్న మండలంలోని నాగాపూర్‌ వాసి గడ్డం శ్యామ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ఆర్మీలో పని చేయడం గర్వంగా ఉందని తెలియజేశారు. ఆర్మీలోని అనుభవాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి రూ. 4057 విరాళాలను సైనిక్‌ వెల్ఫేర్‌ కోసం సేకరించారు. హెచ్‌ఎం మధుబాబు, ఉపాధ్యాయులు బంతిలాల్‌, రాజు, రమేష్‌, గంగాధర్‌, నరేంధర్‌, వర్ష, నవ్య, శ్రీలత, రంజిత్‌, ప్రవళ్లిక, అభిజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ
1
1/2

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ
2
2/2

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement