దీక్షా దివస్ స్ఫూర్తితో కాంగ్రెస్‌పై పోరాడతాం
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమా న్ని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పా ర్టీ కార్యాలయంలో బుధవారం దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న దీక్షా దివస్ కా ర్యక్రమాన్ని 5000 మందితో ఘనంగా నిర్వహిస్తామన్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానం, రోగులకు పండ్లు, పాలు పంపిణీ కార్యక్రమాలు ఏర్పా టు చేస్తామని తెలిపారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు వన్ సైడ్ అని, కాంగ్రెస్, బీజేపీ పతనం డిసైడ్ అయిపోయిందన్నారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడంలో జిల్లా కీలక పాత్ర పోషించాలన్నారు. అనంతరం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉనికి కేసీఆర్ నిర్వహించిన దీక్ష దివాస్ ఫలితమే అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగించేలా ఆంధ్రా పెత్తందారుల మోచేతి నీళ్లు తాగు తూ తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని మంటగలిపేలా రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నా రు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


