ప్రజలను బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేసింది
● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు,
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
ఆర్మూర్‌టౌన్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుద ర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో రూ.27 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న సీసీ, బీటీ రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ వినయ్ రెడ్డితో కలిసి సుదర్శన్ రెడ్డి బుధవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడు తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. త్వరలో లక్కీ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ము న్సిపల్ కమిషనర్ రాజు, ఏఎంసీ చైర్మన్ సాయి బాబాగౌడ్, కాంగ్రెస్ నాయకులు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, బీజేపీ నాయకులు బాలు, ఆకుల శ్రీనివాస్, సుంకరి రంగన్న పాల్గొన్నారు.


