తొలివిడత సంగ్రామం
న్యూస్‌రీల్
నిజామాబాద్
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
● 57 నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
● 2,61,210 మంది ఓటర్లు
రాజ్యాంగ విలువలను..
భారత రాజ్యాంగ విలువలను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.
గురువారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2025
– 8లో u
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా తొలి విడత నామినేషన్ల స్వీకరణ కోసం 57 కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్లస్టర్ గ్రామంగా గుర్తించి నాలుగు నుంచి ఐదు గ్రామాలకు సంబంధించిన సర్పంచి, వార్డుస్థానాల అ భ్యర్థుల నామినేషన్లను అక్కడే స్వీకరించనున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పోలింగ్ సామగ్రితో ఏర్పాట్లు పూర్తిచేసుకున్నా రు. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ పూర్త య్యే వరకు రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు.
సుభాష్‌నగర్: గ్రామపంచా యతీ ఎన్నికల తొలి విడ త నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది. 27న ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కా నుంది. జిల్లాలో బోధ న్ డివిజన్‌లో మొదటి విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 184 జీపీలు, 1,642 వార్డు స్థానాలు, 1,653 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 2,61,210 మంది ఓటర్లు ఉండగా, 1,23,790 పురుషులు, 1,37,413 మహిళలు, 7 ఇతర ఓటర్లు ఉన్నా రు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌లో భాగంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తొలి విడత నోటిఫికేషన్‌లో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. 27 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామపత్రాల పరిశీలన, స్క్రూటినీ ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదేరోజు మూడు గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా, గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.
57 నామినేషన్ కేంద్రాలు..
నోటిఫికేషన్ షెడ్యూల్..
గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. తొలి విడత నోటిఫికేషన్ నేడు వెలువడనున్నది. గురువారం నుంచి 29వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. డిసెంబర్ 3న బరిలో నిలిచే వారి జాబితా ప్రకటించి, 11న పోలింగ్, ఫలితాలు వెల్లడిస్తారు.
తొలివిడత సంగ్రామం
తొలివిడత సంగ్రామం
తొలివిడత సంగ్రామం


