తీర్పు బేఖాతరేనా.. | - | Sakshi
Sakshi News home page

తీర్పు బేఖాతరేనా..

Nov 19 2025 6:19 AM | Updated on Nov 19 2025 6:19 AM

తీర్ప

తీర్పు బేఖాతరేనా..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: తెలంగాణ వర్సిటీలో 2012 అక్రమ నియామకాలను సక్రమం చేసుకునేందుకు గాను హైకోర్టు తీర్పును సైతం బేఖాతరు చే స్తున్న అధ్యాపకులపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అధ్యాపకుల ప్రయత్నాలకు రిజిస్ట్రార్‌ పూర్తి సహాయసహకారా లు అందిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీ నిబంధనలను కా దని 2012 బ్యాచ్‌కు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చే స్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ బ్యాచ్‌ అధ్యాపకులు విధుల్లో చేరిన సమయంలో ‘తాము కోర్టు తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని‘ అండర్‌ టేకింగ్‌ ఇ చ్చారు. అయితే హైకోర్టు తుది తీర్పుకు ముందే రి జిస్ట్రార్‌ వాళ్ల ఫైలును కదలించడం గమనార్హం. ప్రొ బేషన్‌ పీరియడ్‌ ముగిసిన తరువాత సర్వీస్‌ కన్ఫర్మ్‌ చేస్తూ ఇచ్చిన లెటర్‌లోనూ కన్ఫర్మేషన్‌ అనేది కోర్టు తుది తీర్పునకు లోబడే ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ రెండు ఉత్తర్వులు ఇచ్చింది సైతం, ఆయా సందర్భాల్లో ఉన్న యూనివర్సిటీ రిజిస్ట్రార్‌లే. కానీ నిబంధనలు ఉల్లంఘించారు.

● ప్రస్తుత వీసీ యాదగిరిరావును తప్పుదోవ పట్టించి, నిజాలు దాచిపెట్టి ఇంటర్వ్యూలకు ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారు. ఎప్పుడో 2019 నోటిఫికేషన్‌ ద్వారా చేసుకున్న దరఖాస్తులకే పరిశీలన చేయించారు. నిజానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి సీఏఎ స్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని యూజీసీ నిబంధనలు చె బుతున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెట్టి మరో నో టిఫికేషన్‌కు బదులు పాత నోటిఫికేషన్‌నే ప్రమాణికంగా తీసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం.

● దరఖాస్తుల పరిశీలన సమయంలోనూ 2012 అధ్యాపకులకు మద్దతుగా ఆయా సబ్జెక్టు అభ్యర్థుల అప్లికేషన్లలో లొసుగులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా చక్రం తిప్పినట్లు తెలిసింది. తనను వ్యతిరేకించే వాళ్ల దరఖాస్తులను కూడా పరిశీలన సమయంలో దగ్గరుండి క్లియర్‌ చేయించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కనీస రీసెర్చ్‌ పేపర్లు లేకున్నప్పటికీ, యూజీసీ నిబంధనలు ఉల్లంఘించిన, సస్పెండ్‌ అయినవారిని, పాలకమండలి కేసులు నమోదు చేయాలని చెప్పిన అధ్యాపకుల దరఖాస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రార్‌ చూసుకున్నట్లు తెలిసింది.

● పక్కదారి ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ ఉన్నపళంగా హైకోర్టు తీర్పు రావడంతో ఏమీ చేయలేని స్థి తిలో ఉన్న రిజిస్ట్రార్‌ వీసీపై అన్ని రకాలుగా రాజకీయనాయకులు, కొందరు ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 2012 బ్యాచ్‌కు చెందిన అధ్యాపకులు ఒ క్కొక్కరుగా వెళ్లి, హైకోర్టు తీర్పు విషయ మై అప్పీలుకు వెళ్లేందుకు ఈసీలో ఆమోదం తెలి పేలా సహకరించాలని వీసీపై ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలిసింది.

గత రెండుమూడు రోజులుగా సదరు అధ్యాపకులు వీసీని కలుస్తుండడం గమనార్హం. కాగా గతంలోనూ పూర్తిస్థాయి వీసీ లేనప్పుడే ఈ అధ్యాపకుల ప్రమోషన్ల ఫైలును కదిలించారు. ఇప్పుడు కూడా పూర్తిస్థాయి పాలకమండలి లేని సమయంలోనే అన్నీ చేస్తుండడం విశేషం. సదరు అధ్యాపకులు మాత్రం తమకు రాజకీయ అండ ఉందని చెబుతున్నారు. ఈ విషయాలపై వీసీ యాదగిరిరావును ‘సాక్షి’ సంప్రదించగా తీర్పుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్‌ నుంచి ఒరిజినల్‌ తీర్పు కాపీ వచ్చాక పాలకమండలిలో పెడతామన్నారు. పాలకమండలి నిర్ణయం మేరకు ముందుకు వెళతామన్నారు. పాలకమండలి హైకోర్టు తీర్పు మేరకు తొలగించాలని తీర్మానం చేస్తే తక్షణమే సదరు అధ్యాపకులను తొలగిస్తామన్నారు. ఈ విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నట్లు వివరించారు.

పాలకమండలి తిరస్కరించినప్పటికీ..

కేసు హైకోర్టులో ఉండడంతో ఈ అధ్యాపకులకు ప్రమోషన్లు ఇచ్చేది లేదని గతంలో పూర్తిస్థాయి వర్సిటీ పాలకమండలి అనేకసార్లు తేల్చిచెప్పింది. కొందరు అధ్యాపకులు ప్రమోషన్ల కోసం కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంటే వాటిని సైతం పూర్తిస్థాయి పాలకమండలి రద్దు చేసింది. కాగా ప్రస్తుత రిజిస్ట్రార్‌ వచ్చాక పరిస్థితి తారుమారు చేసేందుకు అక్రమ నియామకాలను సక్రమం చేసే బాధ్యతలను భుజాన వేసుకున్న ట్లు విద్యార్థి సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. ఇందు కోసం హైదరాబాద్‌కు అనేకసార్లు వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో బుర్ర వెంకటేశం ఉన్న త విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు అప్పటివరకు ఉన్న నిబంధనలను, నాటి అధికారుల ఉత్తర్వులను తుంగలో తొక్కి 2012 అభ్యర్థులకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకునేలా ఒక లెటర్‌ను తీసుకొచ్చారు. పూర్తిస్థాయి పాలకమండలి, శాశ్వత వీసీ లేని సమయంలో అన్నిరకాల అనుమతులు తెచ్చి పెట్టుకోవడం విశేషం.

తెయూలో 2012 అధ్యాపక

నియామకాలను సక్రమం

చేసుకునేందుకు వక్రమార్గాలు

రాజకీయ అండ ఉందని చెప్పుకుంటూ ఇష్టారాజ్యం

పూర్తిస్థాయి పాలకమండలి లేనప్పుడే మాయాజాలాలు

అంతర్గత ఈసీలో అప్పీలుకు ఆమోదం వచ్చేలా వీసీపై ఒత్తిడి

రిజిస్ట్రార్‌ పావులు కదుపుతున్నారంటూ విద్యార్థి సంఘాల ఆరోపణలు

తీర్పు కాపీ అందాక పాలకమండలి నిర్ణయం మేరకు ముందుకు..

తీర్పు బేఖాతరేనా..1
1/1

తీర్పు బేఖాతరేనా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement