రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
● ఎస్‌ఈ రాపల్లి రవీందర్
వర్ని: రాబోవు వేసవికాలంలో రబీ పంటకు నాణ్యమైన నిరంతర విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాపల్లి రవీందర్ తెలిపారు. మంగళవారం మండలంలోని కూనిపూర్ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్, ఎల్‌వీ బ్రేకర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇంటర్ లింకింగ్ లైన్లు, కొత్త బ్రేకర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్తు సమస్యలు ఏవైనా ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేసి సమస్య వివరించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎండీ ముక్తార్, డీఈ ఆపరేషన్ వెంకటరమణ, డీఈ ఎంఆర్ తోట రాజశేఖర్, ఏడీ ఆపరేషన్ నటరాజ్, ఏడీఈ శ్రీనివాస్, వర్ని ఏఈ సాయిలు, సబ్ ఇంజినీర్ బాలకిషన్, వేణుగోపాల్, ఎల్‌ఐ శ్రీనివాస్, శ్రీరామ్ నాయక్, వర్ని ఏఎంసీ చైర్మన్ సురేశ్ బాబా, పీసీసీ డెలిగేట్ ముత్తారెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు.


