‘పది’ ఫలితాలు మెరుగుపడాలి
నిజామాబాద్ అర్బన్: పదో తరగతి ఫలితాలు మ రింత మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయా లని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. స మీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ పనితీరుపై ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో కలెక్టర్ మంగళవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా నిర్వహణ తీరు, ఆయా బడుల స్థితిగతులు, బోధన తీరు, స దుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించి ది శానిర్దేశం చేశారు. ఎంఈవో, కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఏఈలతో కూడిన కమిటీలు పాఠశాలలను సందర్శించి, సమగ్ర వివరాలతో రూపొందించిన నివేదికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వీక్షిస్తూ సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో పి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.
‘పది’ ఫలితాలు మెరుగుపడాలి


