రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలో ఎస్జీఎఫ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి అండర్–14 బాల, బాలికలకు బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం నిర్వహించారు. పోటీల్లో 95 మంది క్రీడాకారులు పాల్గొనగా 10 మంది ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతరం విజేతలకు బంగారు, వెండి పతకాలు అందించినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ తెలిపారు. బాలికల విభాగంలో సింధుకు బంగారు పతకం, వేదశ్రీ, అక్షర, తేజస్విని, శివ వేదాన్షి వెండి పతకాలు పొందారు. బాలుర విభాగంలో ఎస్‌కే జిషాన్ అలీ బంగారు పతకం, నెయాన్, విష్ణువర్ధన్‌గౌడ్, జైప్రీత్, రుద్రాన్ష్‌రావు వెండి పతకాలు పొందారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ సందీప్‌గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీధర్, సంతోష్, సాయిమౌర్య, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


