పల్లికొండలో చోరీ
● ఆరు తులాల బంగారం, నగదు అపహరణ
కమ్మర్‌పల్లి: భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లికొండ గ్రామానికి చెందిన సదానందం అనే వ్యక్తి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి చోరి జరిగింది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉద యం సదానందం తన కుటుంబ సభ్యులతో కలిసి జ గిత్యాలకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గ మనించిన దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన సదానందం చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న సుమారు ఆరు తులా ల బంగారం, రూ. 40వేల నగదు గల దుబాయి కరె న్సీని దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు తె లిపాడు. క్లూస్ టీంను రప్పించి దుండగుల వేలి ము ద్రలను సేకరించినట్లు ఎస్సై తెలిపారు. బాధితుడి ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


