నేడు బస్టాండ్‌లో వస్తువుల వేలం
సుభాష్‌నగర్: టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్–1 డిపో కార్గో విభాగం ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. మరిచిపోయిన(మిగిలిపోయిన) వస్తువుల వేలం రేట్లపై 30శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ డిపో–1 మేనేజర్ ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలి కాలంలో ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా, వస్తువుల యజమానులు సులభంగా తమ వస్తువులను తిరిగి పొందే అవకాశం కల్పించడానికి ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన నిజామాబాద్ బస్టాండ్ ప్రాంగణంలోని కార్గో ఆఫీస్ వద్ద మధ్యాహ్నం 3 గంటల వరకు వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ అధికారులు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.


