రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపిక
నిజామాబాద్‌నాగారం: రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాలల స్కూల్ ఫెడరేషన్ క్రీడల్లోని రైఫిల్ షూటింగ్ పోటీలకు ఉమ్మడి జిల్లా బృందం ఖరారైనట్లు ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ నాగమణి తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని గన్ ట్రస్ట్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీలో సోమవారం నిర్వహించారు. అండర్–14, 17, 19 బాల, బాలికల ఎంపిక పోటీలు జరిగాయి. ఇందులో 10 మీటర్స్ ఓపెన్ సైట్ రైఫిల్ షూటింగ్, పీప్ సైట్ 10మీటర్స్ రైఫిల్ షూటింగ్ పోటీలు నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ నాగమణి పర్యవేక్షణలో పీడీ ప్రతిభ, కోచ్ ఇంతేకాబ్ అలం, మేనేజర్ ఎస్‌కే ముజాహిద్ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18 నుంచి 20 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు.


