డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు
ఇందల్వాయి: మద్యం సేవించి వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ ముగ్గురికి మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఇందల్వాయి ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన నాయిని సుమన్, సంఘం శ్రీకాంత్, లింగసాయికుమార్ ఇటీవల డ్రంకన్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఏడు రోజు జైలు శిక్ష విధించారు. అదేవిధంగా మరో ఇద్దరికి రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.
ఒకరికి రూ. పదివేల జరిమానా
రెంజల్: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఒకరికి జడ్జి రూ. పదివేల జరిమానా విధించినట్లు ఎస్సై చంద్రమోహన్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన సుద్ద వీరయ్య ఆదివారం మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుబడ్డాడు. అతన్ని బోధన్ కోర్టులో హాజరుపర్చగా జడ్జి రూ. పదివేల జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.
ధర్పల్లి: మద్యం మత్తులో డయల్100 ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి మెజిస్ట్రేట్ ఏడు రోజుల జైలు శిక్షను విధించినట్లు ధర్పల్లి ఎస్సై కళ్యాణి సోమవారం తెలిపారు. మండలంలోని రేకులపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల రాజు ఈనెల 15న మద్యం మత్తులో డయల్–100 కు పలుమార్లు ఫోన్ చేసి అధికారుల సమయాన్ని వృథా చేశాడు. రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ అతనికి ఏడు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సై తెలిపారు.
బీబీపేట: మండలంలోని ఓ గ్రామంలో కన్న కుమార్తైపె తండ్రి అసభ్యంగా ప్రవర్తించడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో తన పన్నెండేళ్ల కుమార్తెతో తండ్రి కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తండ్రి బాధను భరించలేని కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నిజాంసాగర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరిట ఆదివారం అర్ధరాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తు న్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ సోమవారం తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, మాగి గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు మంజీరా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే దాడి చేసి పట్టుకున్నామన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
నస్రుల్లాబాద్: మండలంలోని దుర్కి వద్ద సో మవారం తెల్లవారు జామున పెట్రోలింగ్ పోలీసులు 12 క్వింటాళ్ల 80కిలోల రేషన్ బి య్యం ఉన్న 266 సంచులను పట్టుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ షరీపొద్దీన్ తెలిపారు. నిందితులు డీసీఎంలో షాద్‌నగర్ నుంచి ధర్మబాద్‌కు అక్రమంగా తీసుకెళ్తుండగా పట్టుకున్నామన్నారు. ఎస్సై రాఘవేంద్ర సమక్షంలో పంచనామ నిర్వహించారు. డ్రైవర్ షేక్ అజీ స్, వాహన యజమాని ఎండీ ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నవీపేట: మండలంలోని ఓ తండాకు చెందిన యువతి అదృశ్యమైనట్లు ఎస్సై తిరుపతి సోమవారం తెలిపారు. యువతి తల్లి బోధన్‌లో చదువుతున్న కుమారుడి వద్దకు ఆదివారం ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చింది. ఇంట్లో కుమార్తె కనిపించకపోవడంతో పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


