బీర్కూర్‌లో చోరీ
● 4 తులాల బంగారం, వెండి, నగదు అపహరణ
బీర్కూర్: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గాండ్ల సంజీవ్ అనే వ్యక్తి మోస్రా మండలం చింతకుంటలో బంధువుల శుభాకార్యానికి ఈ నెల 15న కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సోమవారం ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, రూరల్ సీఐ తిరుపయ్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. బీరువాలో ఉన్న 4 తులాల బంగారం, 12 తులాల వెండి, రూ.2 లక్షల నగదు చోరీకి గురైందని బాధితుడు సంజీవ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అంబం గ్రామంలో..
బోధన్: ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన ఔసలి వెంకటేశం ఇంట్లో సోమవారం చోరీ జరిగినట్లు ఎస్సై ముత్యాల రమ సోమవారం తెలిపారు. వెంకటేశం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కామారెడ్డికి వెళ్లారు. దుండగులు రాత్రి ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న నాలుగు గ్రాముల బంగారం, 30 తులాల వెండి, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పేకాడుతున్న 9 మంది అరెస్టు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని ధర్మపురిహిల్స్‌లో నిర్వహిస్తున్న పేకాట కేంద్రంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. పేకాడుతున్న 9 మందిని అరెస్టు చేసి 8 సెల్‌ఫోన్లు, 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ లీగల్: నగరంలోని బోర్గాం(పి)లో సందగిరి భూమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిగంగా శరణాలయాన్ని జిల్లా న్యాయ సేవాధికా రి సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సీని యర్ సివిల్ జడ్జి సాయిసుధా సోమవారం తనిఖీ చేశారు. వృద్ధులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. అనంతరం వృద్ధులకు బెడ్ షీట్లను పంపిణీ చేశారు. న్యాయసేవా సంస్థ సూపరింటెండెంట్ శైలజ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
బీర్కూర్‌లో చోరీ


