విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
● గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి
ఖలీల్‌వాడి: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని అన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమయ్యే అన్ని పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. స్థానిక పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని పాఠకులు చైర్మన్‌కు వినతులు అందజేశారు. వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి. బుగ్గారెడ్డి, డిప్యూటీ లైబ్రరీ ఏ రాజిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, రికార్డ్ అసిస్టెంట్ అభిలాష్, కంప్యూటర్ ఆపరేటర్ మధు, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.


