కాలువలో పడి వృద్ధురాలి మృతి
నందిపేట్: మండల కేంద్రంలోని పలుగుట్ట సమీపంలోని నిజాంసాగర్ కాలువలో పడి కై రి గంగామణి (68) అనే వృద్ధురాలు మృతి చెందింది. నందిపేట్ ఎస్సై శ్యాంరాజ్ తెలిపిన వివరాల ప్రకా రం.. జిల్లా కేంద్రంలోని బోర్గాం(పి) శాస్త్రినగర్‌కు చెందిన కై రి గంగామణి గత 45 ఏళ్ల క్రితం ఆలూర్ మండల కేంద్రానికి చెందిన కృష్ణగౌడ్‌తో విడాకులు తీసుకుంది. నాటి నుంచి శాస్త్రినగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ప్రతి నెల నందిపేటలోని పలుగుట్ట పుణ్య క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్లేది. ఈ నెల 5న పలుగుట్టకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం నిజాంసాగర్ కాలువలో మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వారు మృతురాలి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలు కాలకృత్యాలకు వచ్చి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తమ్ముడు గంగాధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


