జాతీయ పార్టీల్లో జోష్
● బిహార్‌లో ఎన్డీఏ భారీ విజయంతో బీజేపీ శ్రేణుల సంబరాలు ● ‘జూబ్లీహిల్స్’ విజయంతో కాంగ్రెస్‌లో హుషారు
● జిల్లాలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్న ఇరు పార్టీల నాయకులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బిహార్, జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో జిల్లాలో శుక్రవారం జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
బిహార్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. మరోవైపు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. బిహార్ ఫలితంతో దేశవ్యాప్తంగా బీజేపీకి మరింత ఆదరణ పెరిగిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారం దక్కించుకునే దిశగా ముందుకెళుతుందని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందూరు జిల్లా నుంచే విజయానికి పునాదులు పడతాయంటున్నా రు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ గెలుపుతో అందరి అనుమానాలు పటాపంచలయ్యాయని, ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత లేదని రుజువైందన్నారు. తదుపరి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ స్వీప్ చేస్తామని చెబుతున్నారు. ఇరు పార్టీలు పోటాపోటీగా సంబరాలు చేసుకున్నాయి.
జాతీయ పార్టీల్లో జోష్
జాతీయ పార్టీల్లో జోష్


