విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలి

Nov 15 2025 7:11 AM | Updated on Nov 15 2025 7:11 AM

విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలి

విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలి

నిజామాబాద్‌ రూరల్‌: విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా నాణ్యమైన విద్యను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు పీ సుదర్శన్‌ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనారి టీ సంక్షేమ శాఖల సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పా లిటెక్నిక్‌ కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్‌ భవనాలను శుక్రవారం ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు డాక్టర్‌ భూపతి రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డిలతో కలిసి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ ప్రారంభించారు. వసతిగృహ నిర్మాణా లకు పూర్వ విద్యార్థి ప్రతాప్‌ రెడ్డి రూ. 1.06 కోట్లు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ రూ. 2.86 కోట్లు విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గత పదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాంకేతిక విద్యను బలోపేతం చేయాలనే కృతనిశ్చయంతో సీఎం రేవంత్‌ రెడ్డి విస్తృత చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఆధునిక సాంకేతిక విద్యను అభివృద్ధి చేయడం ద్వారా యువతకు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

నెహ్రూ హయాంలోనే..

భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలోనే పాలిటెక్నిక్‌ కళాశాల ప్రారంభమైందని, ఆయన పుట్టిన రోజునే హాస్టల్‌ భవనాల ప్రారంభోత్సవాలు నిర్వహించడం అభినందనీయ మని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. రూ.80 కోట్లతో జిల్లాకు ఇంటిగ్రే టెడ్‌ కళాశాల మంజూరైందని, దానికి జిల్లా కేంద్రంలో 10 ఎకరాల స్థలం అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు విద్య, వైద్యాన్ని ప్రభుత్వం పారదర్శకంగా అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అ నుగుణంగా జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామన్నారు. నేటి సా మాజిక అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక విద్యతో కూడిన కోర్సులను విద్యార్థులకు అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 66 ఏటీసీలను ప్రారంభించామని ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకు న్న యువతకు సత్వరమే ఉద్యోగ, ఉపాధి అవకాశా లు లభించేలా చర్యలు తీసుకుందని, టాటా కంపెనీతో ఒప్పందం సైతం కుదుర్చుకుందని తెలిపారు. విద్య సమాజ మార్పులకు పునాది అని అర్బన్‌ ఎ మ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. భవిష్యత్తులో ఈ కళాశాల తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆదర్శ విద్యాసంస్థగా నిలబడాలని ఆ కాంక్షించారు. అనంతరం పూర్వ విద్యార్థి ప్రతాప్‌ రెడ్డి, బీహెచ్‌ఈఎల్‌ సహాయ జనరల్‌ మేనేజర్‌ సె ల్వంను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర స హకార సంఘాల యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మా నాల మోహన్‌ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ రమేశ్‌ రెడ్డి, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ భారతి పాల్గొన్నారు.

ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌ రెడ్డి, మహ్మద్‌ అలీ షబ్బీర్‌

పాలిటెక్నిక్‌ కళాశాలలో నూతన హాస్టల్‌ భవనాల ప్రారంభోత్సవం

హాజరైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement