జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు
నిజామాబాద్‌అర్బన్: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో బైక్‌ల చోరీకి పాల్పడిన ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వీక్లీ మార్కెట్‌లో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తుండగా వారిని ఆపి వాహన ధ్రువీకరణ పత్రాలను చూయించాలని పోలీసులు అడుగగా వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకొని విచారించగా బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. న్యాల్‌కల్ రోడ్డు సమీపంలో ఉన్న హనుమాన్‌నగర్‌కు చెందిన గాజబారే నగేశ్ హనుమంత్, మోహన్ అనే ఇద్దరు వ్యక్తులు ఎలాంటి పనులు చేయకుండా జల్సాలకు అలవాటు పడ్డ వీరు బైకు దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖలీల్‌వాడిలోని మహాలక్ష్మి ఆస్పత్రి ఎదుట ఉన్న బైక్, ప్రభుత్వ ఆస్పత్రిలో మరో బైకును దొంగతనం చేసి వాటిని వినాయక్‌నగర్‌లో ఉన్న షేక్ గౌస్ అనే వ్యక్తికి విక్రయించినట్లు నిందితులు తెలిపారు. అలాగే ఆర్యనగర్‌లో, వీక్లీ మార్కెట్లో రెండు బైక్‌లను దొంగిలించినట్లు వారు విచారణలో ఒప్పుకున్నారు. ఇద్దరు నిందితులతో పాటు దొంగ బైక్ అని తెలిసి కూడా కొనుగోలు చేసిన షేక్‌గౌస్‌పై కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


