నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యం
బోధన్ రూరల్: నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా తమ లక్ష్యమని ట్రాన్స్‌కో ఎస్‌ఈ రవీందర్ అన్నారు. బోధన్ మండలంలోని 33/11 కేవీ చెక్కి క్యాంపు విద్యుత్ ఉపకేంద్రానికి పెంటకుర్దు ఫ్లీడర్ నుంచి నూతన లైన్ ద్వారా విద్యుత్ సరఫరాను బుధవారం అనుసంధానం చేశారు. సీఎండీ వరుణ్‌రెడ్డి ఆదేశాలతో ప్రతి విద్యుత్ ఉప కేంద్రానికి ప్రత్యామ్నాయంగా 33 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 33/11 కేవీ విద్యుత్‌ను చెక్కి క్యాంపు విద్యుత్ కేంద్రానికి రూ.35 లక్షల వ్యయంతో ప్రత్యామ్నాయ ఫీడర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈలు ముక్తార్, డి. వెంకటరమణ, ఏడీలు తోట రాజశేఖర్, కె.నగేశ్ కుమార్, ఏఈలు ఆర్ సుమిత, జె. కల్యాణ్, స్థానిక ఫోర్‌మన్ డేవిడ్, లైన్‌ఇన్‌స్పెక్టర్ గఫార్, కాంట్రాక్టర్ రవి యాదవ్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.


