టార్పాలిన్లు ఇవ్వాలని రాస్తారోకో
రుద్రూర్: తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం నుంచి ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమయ్యే టార్పాలిన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండల కేంద్రంలో బుధవారం రై తులు రాస్తారోకో చేశారు. టార్పాలిన్లు ఇవ్వడంలో చిన్న, సన్నకారు రైతుల పట్ల వివక్ష చూపుతున్నా రని ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. వాన కురిస్తే ధాన్యంపై పట్టాలు కప్పేందుకు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు టార్పాలిన్లు ఇవ్వడంలో పెద్ద రైతులకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులకు టార్పాలిన్లు ఇవ్వాలని మంత్రులు ప్రకటనలు చేస్తున్నా అధికారులు అమలు చేయడం లేదన్నారు. తడిసిన ధాన్యా న్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశా రు. సుమారు గంటపాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు, స్థానిక నాయకులు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.


