టేకు దుంగలు స్వాధీనం
ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ధర్పల్లి మండలం రామడుగు గ్రామ శివారులోని పట్టా భూమి నుంచి టేకు చెట్లను నరికి అక్రమంగా తరలిస్తుండగా మంగళవారం రాత్రిపెట్రోలింగ్ స మయంలో స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఆర్‌వో రవి మోహన్ భట్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న టేకు దుంగలను, వాటిని తరలిస్తున్న వాహనాన్ని ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశామన్నారు.పట్టా భూమిలోని చెట్ల ను నరికే ముందు అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా అటవీ చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తుకారం రాథోడ్, సెక్షన్ ఆఫీసర్లు అతిఖ్, భాస్కర్, బీట్ ఆఫీసర్లు ఉదయ్, ఖాదీర్, ప్రవీణ్, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు.
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని నాగాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నాగాపూర్ నుంచి కమ్మర్‌పల్లికి ప్రయాణికులతో వస్తున్న ఆటో ను మెట్‌పల్లి వైపునకు వెళ్తున్న తుఫాన్ వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో ఆటో నడుపుతున్న డ్రైవర్ ఖాదర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్తానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
రెంజల్: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి బోధన్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శేష తల్పసాయి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై చంద్రమోహన్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం సాటాపూర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ఇద్దరు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని పీఎస్‌కు తరలించి కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు న్యూసెన్స్ కేసులో మరో ఇద్దరికి జడ్జి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానాను సైతం విధించినట్లు ఎస్సై తెలిపారు.
లింగంపేట: మండలంలోని కోమట్‌పల్లిలో పేకాటస్థావరంపై దాడిచేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ బుధవారం తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన నలుగురు పట్టుబడగా వీరి నుంచి రూ. 5,530 నగదు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు.
టేకు దుంగలు స్వాధీనం


