ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న సబ్ కలెక్టర్
వేల్పూర్: మండలంలోని పచ్చలనడ్కుడ పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు, పొక్లెయిన్‌ను ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, వేల్పూర్ తహసీల్దార్ శ్రీకాంత్ బుధవారం పట్టుకున్నారు. పచ్చలనడ్కుడ సొసైటీలో ధాన్యం కొనుగోలు వివరాలను పరిశీలించిన అనంతరం వేల్పూర్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ట్రాక్టర్లు, పొక్లెయిన్‌ను పట్టుకొని కేసు నమోదు చేసి, వేల్పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మాక్లూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను ఆసరాగా చేసుకొని వల్లబాపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు వారి ట్రాక్టర్లతో మరోచోటికి తరలిస్తుండగా తహసీల్దార్ శేఖర్ బుధవారం రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ధర్మోరా, గంగరమంద గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వల్లబాపూర్, చిక్లీ క్వారీ నుంచి వే బిల్లులు ఇచ్చారు. ఆర్‌ఐ షఫీ, జీపీవో సృజన్‌ల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఇసుక క్వారీల నుంచి ఇసుక రవాణా ప్రారంభమైంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక పక్కదారి పడుతుందన్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ శేఖర్ చిక్లీ ఇసుక క్వారీకి 4 ట్రాక్టర్లు, వల్లభాపూర్ ఇసుక క్వారీకి 7 ట్రాక్టర్లు మొత్తం 11 ట్రాక్టర్ల ద్వారా 52 ట్రిప్పుల ఇసుక తరలించటానికి అనుమతి ఇచ్చారు. దీంతో వల్లభాపూర్ ఇసుక క్వారీ నుంచి ఇద్దరు అనుమతి ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు కాకుండా మరో చోటికి తరలించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన తహసీల్దార్ పోలీసు సిబ్బందితో హుటాహుటిన రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పీఎస్‌కు తరలించారు. ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకను పక్కదారి పట్టిస్తే సహించేది లేదని తహసీల్దార్ హెచ్చరించారు.
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న సబ్ కలెక్టర్


