తప్పిపోయిన చిన్నారుల అప్పగింత
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో తప్పిపోయిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలోని గౌడ్స్ కాలనీకి చెందిన శౌర్యగౌడ్ మంగళవారం రాత్రి ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి రోధించాడు. ఆ దారి గుండి వెళ్తున్న ఆటోడ్రైవర్ రాములు బాలుడిని గుర్తించి పోలీసులకు అప్పగించాడు. కొద్దిసేపటికి వాట్సాప్‌లో తమ కుమారుడు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పీఎస్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. దీంతో ఎస్సై–2 సుబ్రహ్మణ్యచారి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
పిట్లం:పిట్లం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో తప్పిపోయిన ఓ చిన్నారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.మండల కేంద్రంలోని బుడగ జంగం కాలనీకి చెందిన బేతయ్య దంపతులు కుమార్తె వరలక్ష్మి తో కలిసి బుధవారం ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చారు. చి న్నారిని వారు అక్కడే మరిచిపోయి ఇంటికి చేరుకున్నారు. దీంతో చిన్నారి అక్కడే ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తమ చిన్నారి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లుగుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను సంప్రదించారు. పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
తప్పిపోయిన చిన్నారుల అప్పగింత


