నేడు సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్ నాగారం: సాఫ్ట్‌బాల్ జిల్లాస్థాయి సీనియర్ క్రీడాకారుల ఎంపికలు బుధవారం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి ప్రభాకర్ రెడ్డి, మర్కంటి గంగామోహన్ తెలిపారు. ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల క్రీడా మైదానంలో పు రుషులు, సుద్దపల్లి సాంఘిక సంక్షేమ మహిళా కళాశాలలో మహిళలకు మధ్యా హ్నం 3 గంటలకు ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు జిల్లా కోచ్‌లు నరేశ్, మౌనికకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
4న జిల్లా స్థాయి
యువజనోత్సవాలు
నిజామాబాద్ నాగారం: జిల్లా స్థాయి యువజనోత్సవాలను వచ్చే నెల 4న నగరంలోని తిలక్‌గార్డెన్ ఆవరణలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జానపద నృత్యం (బృందం), జానపద గీతాలు (బృందం), కథ రచన, పెయింటింగ్, వక్త్తృత్వ, కవిత్వ రచన, ఇన్నోవేషన్ (ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా) అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని పేర్కొ న్నారు. జిల్లాకు చెందిన 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువత పాల్గొనాలని కోరా రు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని, అక్కడ ప్రథమ స్థానంలో నిలిచిన వారిని జాతీయస్థాయికి పంపనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల యువత dyso nizamabad@gmail.com మెయిల్ ద్వారా లేదా 97011 77144, 99596 49574 వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
అర్హులకే ఉజ్వల పఽథకం
● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని అర్హులైన వారిని ఉజ్వల పథకానికి ఎంపిక చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఉజ్వల పథకానికి సంబంధించి నోడల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉజ్వల పథకానికి 18 సంవత్సరాలు నిండిన, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన మహిళలు అర్హులన్నారు. ఒకే కుటుంబంలో మరొక ఎల్‌పీజీ కనెక్షన్ ఉండొద్దని తెలిపారు. పన్ను చెల్లించే పరిధిలో ఉండకూడదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పాసుబుక్, మొబైల్ నెంబర్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో ఆన్‌లైన్, గ్యాస్ ఏజెన్సీల వద్ద దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో బీపీసీఎల్ జిల్లా నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాక్టికల్స్‌కు సిద్ధం కావాలి
● ఇంటర్ బోర్డు జిల్లా ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న
బోధన్: వచ్చే నెలలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించి సిలబస్ పూర్తి చేసుకొని ప్రాక్టికల్స్‌కు సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్‌బోర్డు జిల్లా ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. బోర్డు కేటాయించిన నిధులను వినియోగించుకొని సివిల్, ఎలక్ట్రికల్, ఫర్నిచర్ ఇతర మరమ్మతు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. మంగళవారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని బోధన్, వర్ని, కోటగిరి, మధుమలాంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను డీఐఈవో రవికుమార్‌తో కలిసి తనిఖీ చేశారు. ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశమై మాట్లాడారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల యూడైస్, అపార్ ఐడీ నంబర్ నమోదును వెంటనే పూర్తి చేయాలన్నారు. నవంబర్ మొదటి వారంలోనే ఇంటర్ పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటిస్తుందన్నారు. గతేడాది అమలు చేసిన 90 రోజుల ప్రణాళికను ఈసారి కూడా అమలు చేసే అవకాశం ఉందన్నారు. సమావేశాల్లో కళాశాలల ప్రిన్సిపాళ్లు కల్పన, కౌసర్ పాషా, నిఖత్ కౌసర్, జాఫర్ , అధ్యాపకులు పాల్గొన్నారు.
నేడు సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక


