రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లోనే కవిత జనంబాట
సుభాష్‌నగర్: సీఎం రేవంత్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత బిజినెస్ పార్ట్‌నర్స్ అని, ఆయన డైరెక్షన్‌లోనే కవిత జనంబాట చేపడుతోందని ఎంపీ అర్వింద్ ధర్మపురి విమర్శించారు. నిజామాబాద్ నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపిందెవరని, వారు చదువుకుంటే జీర్ణంకాని కుటుంబం కల్వకుంట్ల కుటుంబమని ఆరోపించారు. తెలంగాణ రాక ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్ రెగ్యులర్‌గా వచ్చేదని, కేసీఆర్ పాలనలో పదేళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక యా జమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేశా యని గుర్తుచేశారు. గ్రూప్స్ పరీక్షలను అటకెక్కించారని, బీ సీ, ఎస్సీ, ఎస్టీలకు విద్యా, ఉద్యోగాలు వస్తే కేసీఆర్ కుటుంబం జీర్ణించుకోలేకపోయిందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కూడా తానేం చేయాలో కవి త చెప్తుందా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్నిరంగాల్లో వెనకబడటానికి కారణం బీఆర్‌ఎస్ అన్నారు. కవతను కన్న తండ్రి, సొంత అన్ననే పార్టీ, ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, ఇక ప్రజలు ఏం ఆదరిస్తారని ఎద్దేవా చేశారు. భవిష్యత్‌లో కవితతో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ పెట్టిస్తారని, ఆమెకు రాష్ట్రంలో ఏవర్గం కూడా ఓట్లు వేయదన్నారు. ప్రజలేం అమాయకులు కాదని, అన్ని గమనిస్తున్నారని, కుల రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
80 శాతం కేంద్రం నిధులే..
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో యూజీడీ, తాగునీటి పథకాల కోసం ఇటీవల విడుదలైన నిధుల్లో 80 శాతం కేంద్రానివేనని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. రూ.169.3 కోట్లలో రూ.135 కోట్లు కేంద్రానివని, రూ.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానివన్నారు. ఈ నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటుందన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు నిధుల విషయంలో ఏం తెలియదని, సబ్జెక్టు లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నాయకులు వడ్డి మోహన్‌రెడ్డి, కంచెట్టి గంగాధర్, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎదిగితే
జీర్ణించుకోలేని కల్వకుంట్ల కుటుంబం
సీఎంతో రాజీనామా చేయిస్తే
బీసీ రిజర్వేషన్లు
ఎంపీ అర్వింద్ ధర్మపురి


