స్వగ్రామానికి చేరిన మృతదేహం
భిక్కనూరు: సౌత్ ఆఫ్రికాలో ఈనెల 20న మృతి చెందిన బత్తుల శ్రీనివాస్ మృతదేహం ఆదివారం భిక్కనూరుకు చేరుకుంది. బతుకుదెరువు కోసం ఇటీవల సౌత్ ఆఫ్రికాకు వెళ్లిన శ్రీనివాస్ కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబీకులు, బందుమిత్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహన్ని చూసిన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో ప్రజలు పాల్గొని శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని విఠల్‌వాడీ తండాకు చెందిన పవర్ సవితపై అనుమానంతో గురువారం రాత్రి భర్త పవర్ కిషన్ హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదివారం నిందితుడు కిషన్‌ను పట్టుకొని, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అరుణ్ కుమార్, సీఐ రవికుమార్ తెలిపారు.
పిట్లం(జుక్కల్): తండ్రికి సేవలు చేయలేక అడ్డు తొలగించుకున్నడో కొడుకు. మండలంలోని గౌ రారం తండాలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాలు ఇలా.. గౌరారం తండాకు చెందిన కేతావత్ వామన్ తన తండ్రి దశరథ్ (58)కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొంతకాలం నుంచి సపర్యలు చేస్తున్నాడు. తండ్రికి భోజనం పెట్టడం, బట్టలు ఉతకడం, స్నానం చేయించడం, మలమూత్ర విసర్జన ఎత్తిపోయడం వంటి పనులు అతడు భారంగా భావించాడు. దీంతో తండ్రికి సేవలు చేయలేక హతమార్చాలనుకున్నాడు. ఈనెల 24న రాత్రి తండ్రికి కల్లులో గుర్తుతెలియని పురుగుల మందు తాగించి, హత్యచేశాడు. అందరికి సాధారణ మృతిగా నమ్మించాడు. కానీ దశరథ్ చిన్న కొడుకు కేతావత్ శ్రీకాంత్ తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వామన్‌ను పట్టుకొని విచారించగా, తానే తండ్రిని హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు వామన్‌ను ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని అంజని గ్రామ శివారులో శనివారం రాత్రి పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వారి నుంచి రూ.12,750 నగదు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు వివరించారు.
బొమ్మా–బొరుసు ఆడుతున్న 8మంది..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బాణాపూర్ గ్రామ శివారులో బొమ్మా, బొరుసు(చిత్తు,బొత్తు) ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బొమ్మా–బొరుసు కేంద్రంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలు, 5 ఫోన్లు, రూ. 3400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామ శివారులోగల డిచ్‌పల్లి – నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఓ కారు అదుపుతప్పి సమీపంలోని పెట్రోల్ బంక్ దిమ్మెను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు పెట్రోల్ పంపు లోపలికి వెళ్లివుంటే పెను ప్రమాదం సంభవించేదని, బంక్ దిమ్మె వద్దనే నిలిచిపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదంపై బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
స్వగ్రామానికి చేరిన మృతదేహం
స్వగ్రామానికి చేరిన మృతదేహం


