అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
మోపాల్(నిజామాబాద్‌రూరల్): ఏళ్లుగా పోడు భూ ములు సాగు చేస్తున్న రైతుల పట్ల అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తె లంగాణ జాగృతి జనం బాటలో భాగంగా మండలంలోని వెంకట్రాంనాయక్ తండాలో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు రామావత్ ప్రకాశ్ కు టుంబ సభ్యులను ఆదివారం ఆమె పరామర్శించారు. అంతకుముందు అటవీ అధికారులు ధ్వంసం చేసిన పంట భూమిని పరిశీలించారు. అలాగే బైరాపూర్ పో చమ్మ తల్లి, వెంకట్రాంనాయక్ తండాలోని జగదాంబ మాతా ఆలయంలో పూజలుచేశారు. గిరిజనులతో క లిసి నృత్యాలు చేశారు. అనంతరం కవిత మాట్లాడు తూ.. మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనప్పు డు పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులను అటవీ అధికారులు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు శ్రీనివాస్ గౌడ్, నరేష్ నాయక్, ప్రేమ్‌దాస్, జలంధర్, ఇందల్ నాయక్, స్థానిక రైతు లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శ
నిజామాబాద్ అర్బన్: అమరుడైన కానిస్టేబుల్ ప్రమో ద్ కుటుంబ సభ్యులను ఆదివారం నగరంలో కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళ్లు అర్పించారు. అలాగే ప్రమో ద్ హత్య నిందితుడు రియాజ్‌ను పట్టుకునేక్రమంలో గాయపడిన ఆసిఫ్‌ను కవిత పరామర్శించారు.
అటవీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు


