కరెంట్‌షాక్‌తో యువ రైతు మృతి
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఆరేడ్ గ్రామంలో ఓ యువరైతు కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గాండ్ల బసప్ప(38) అనే యువ రైతు ఆదివారం సాయంత్రం గ్రామశివారులోని పొలానికి వెళ్లాడు. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఉన్న కరెంట్ మోటార్ ఆన్ కాకపోవడంతో కేబుల్ వైర్ పట్టుకొని ప్రాజెక్టు నీళ్లల్లోకి దిగాడు. కేబుల్ వైర్‌తోపాటు మోటార్ వద్దకు చేరుకున్న బసప్ప కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. బసప్ప తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అతడి కోసం గాలించగా కరెంట్ మోటార్ వద్ద నీటిలో అతడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో ఒకరు..
రాజంపేట: మండలంలోని మూడుమామిళ్ల తండాలో ఒకరు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని శేర్‌శంకర్ తండా పరిధిలోని మూడుమామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ లాల్య(38) ఆదివారం ఉదయం ఇంటి నిర్మాణ విషయంలో పక్కవారితో గొడవపడ్డాడు. అనంతరం తన ఇంట్లోకి వచ్చి నీరు తాగి, మళ్లీ బయటకు వెళ్లగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.
కరెంట్‌షాక్‌తో యువ రైతు మృతి


