ఈ వంటలక్కలు
ట్రెండ్ సెట్టర్స్..
ఫంక్షన్ ఏదైనా.. ఎన్ని వేల మందికై నా సరే.. మాంసాహారమైనా.. కూరగాయలైనా ఒంటిచేత్తో వండేస్తామంటూ ముందుకొస్తున్నారు వంటలక్కలు. కుటుంబ పోషణ కోసం పెట్టుబడి లేకుండా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నారు. వంటలు చేస్తూ భోజనప్రియుల మన్ననలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న ఆర్మూర్ అతివలపై
ఆదివారం ప్రత్యేక కథనం..
ఫంక్షన్ హాల్‌లో వంటలు చేస్తున్న పెద్దగొండ పుష్ప
ఆర్మూర్: పెళ్లి విందు.. పుట్టినరోజు పార్టీ.. శ్రీమంతం.. నామకరణ మహోత్సవం..గుళ్లలో సత్రాలు.. ఏదైనా సరే.. వంటలు రుచికరంగా ఉన్నాయని నలుగురూ అన్నారంటే ఆ ఫంక్షన్ సక్సెస్ అయినట్లే. నోరూరించే వంటకాలు చేయడంలో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన మగవారు సిద్ధహస్తులుగా ఉండేవారు. క్రమంగా వారు కనుమరుగవుతున్నారు. అయితే, ఇటీవల పాకశాస్త్ర ప్రవీణ్యులుగా తెరపైకి వస్తున్నారు కొందరు ఆర్మూర్ మహిళలు.
సర్వం పనులు.. గ్రూపులో ఇద్దరే
ఆర్మూర్ ప్రాంతంలో సుమారు 40 మందికి పైగా మహిళలు వంటలు చేయడాన్ని స్వయం ఉపాధిగా ఎంచుకున్నారు. యాదృచ్ఛికంగా ఎవరికి వారే ఇద్దరు మహిళల చొప్పున 20 గ్రూపులు ఏర్పడ్డాయి. వండే వంటకాలు, భోజనం చేసే వారి సంఖ్య మేరకు ఇద్దరు మహిళలే ధర మాట్లాడుకొని ఫంక్షన్ హాళ్లు, ఇళ్లు, గుళ్లలో వంటలు చేస్తూ ఆత్మగౌరవంతో నిలుస్తున్నారు. వంటకం రుచి విషయంలో సైతం నలభీములను మించి పోతున్నారు. మగవారు వంట వాళ్లుగా వస్తే వారికి ఒక అసిస్టెంట్‌తోపాటు కూరగాయలు కోసేందుకు, వంట పాత్రలు శుభ్రం చేయడానికి, వడ్డించడానికి క్యాటరింగ్ వారు వేర్వేరుగా కూలీలను తీసుకొని రావడంతో ఫంక్షన్ చేసే వారికి ఆర్థిక భారమయ్యేది. ఈ జంట వంటలక్కలు మాత్రం తాము మాట్లాడుకున్న ధరలో వంట చేసేముందు పాత్రలను శుభ్రం చేయడం, కూరగాయలు కోసుకోవడం, వంట చేయడం, భోజనాలు పూర్తయిన తర్వాత పాత్రలను యథావిధిగా కడిగి వెళ్లడం, అవసరమైతే వడ్డించడం కూడా చేస్తున్నారు. తక్కువ ధరలో వంటలక్కల సేవలు అందుబాటులో ఉండటంతో అందరూ వీరినే సంప్రదిస్తున్నారు.
వీరి సేవలు కేవలం ఆర్మూర్ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా క్రమంగా విస్తరిస్తున్నాయి. చుట్టు పక్కల పట్టణాలు, గ్రామాలతోపాటు హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఈ ప్రాంతం వారు సైతం తమ ఇళ్లలోని ఫంక్షన్‌లకు వంట చేసేందుకు వీరిని ప్రత్యేకంగా పిలిపించుకుంటున్నారు. కేవ లం మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే వీరికి వంటల కాంట్రాక్టులు లభిస్తున్నాయి. పాలకుల నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందకున్నా స్వశక్తితో ఉపాధి పొందుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు.
స్వశక్తితో స్వయం ఉపాధి
ఫంక్షన్‌లలో వంటలు చేస్తూ
రాణిస్తున్న అతివలు
నలభీములను తలపించే వంటల రుచి
పెద్ద వంటలన్నీ ఒంటి చేత్తో
చక్కబెడుతూ..
ఈ వంటలక్కలు
ఈ వంటలక్కలు
ఈ వంటలక్కలు
ఈ వంటలక్కలు


