వర్షం.. రైతు ఆగం
రెంజల్ శివారులో తడిసిన ధాన్యం కుప్ప నుంచి వర్షపు నీటిని తొలగిస్తున్న రైతులు
ఎడపల్లి మండలంలోని మంగల్‌పాడ్
శివారులో వడ్ల కుప్పల చుట్టూ వర్షపు నీరు
బోధన్/ రెంజల్/ జక్రాన్‌పల్లి: చేతికొచ్చిన పంట విక్రయించే దశలో వర్షం రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వరి నూర్పిళ్లు పూర్తి చేసుకొని ఖాళీ ప్రదేశాలు, కొనుగోలు కేంద్రాల ఆవరణలో ఆరబోసిన ధాన్యం పలుచోట్ల వర్షానికి తడిసింది. బోధన్, సాలూర, ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాల్లో వర్షం కురిసింది. మూడు, నాలుగు రోజులుగా ఆరబెట్టిన ధాన్యం ఒక్క రోజులో తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్, వివేక్‌నగర్, పడకల్ తండా తదితర గ్రామాల్లో వరి పంట నేలవాలింది. రోడ్లపై, కల్లాల్లో ఆరబోసిన మక్కలు, వడ్లు తడిసిముద్దయ్యాయి. తడిసిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
తడిసిన వడ్లు, మక్కలు
వర్షం.. రైతు ఆగం
వర్షం.. రైతు ఆగం


