మత్తు పదార్థాల నిరోధానికి కృషి
నిజామాబాద్‌అర్బన్: మాదక ద్రవ్యాలు, మత్తు ప దార్థాల నిరోధానికి సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు పాల్గొని, జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై చర్చించా రు. కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పెనుసవాలుగా మారిందని అన్నారు. యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు రవాణా, వినియోగం జరుగకుండా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యత అని భావించకుండా సమాజంలోని వివిధ వర్గాల వారందరూ మా దకద్రవ్యాల నిరోధానికి తమవంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగం గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. టో ల్ ఫ్రీ నెంబర్ 14446కు కాల్ చేసి సమాచారం తెలుపవచ్చని సూచించారు. అనంతరం నషా ముక్త్ భా రత్ అభియాన్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సామూహిక ప్రతిజ్ఞ కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి రసూల్ బీ, డీఐఈవో రవికుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పాల్గొన్నారు.


