వంద శాతంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

వంద శాతంపై ప్రత్యేక దృష్టి

Oct 24 2025 2:17 AM | Updated on Oct 24 2025 2:40 AM

వంద శ

వంద శాతంపై ప్రత్యేక దృష్టి

లక్ష్యాన్ని పూర్తిచేస్తాం..

ఏఎంసీల వారీగా ఫీజుల వివరాలు (రూ.లలో)

సుభాష్‌నగర్‌ : జిల్లాలో రైతులు పండిస్తున్న పంటల అమ్మకాలు, కొనుగోళ్ల ద్వారా ఈ ఏడాదికి (2025– 26) రూ.40.36 కోట్ల ఆదాయాన్ని మార్కెటింగ్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గడిచిన ఆరు నె లల్లో నిర్దేశించుకున్న లక్ష్యంలో పావుశాతమే ఫీజు వసూలైంది. ఇప్పటికీ కేవలం రూ.11.20 కోట్లు మాత్రమే వసూలు కావడంపై జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా లోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా లక్ష్యా న్ని సాధించేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

జిల్లాలో ఏడు ఏఎంసీలు..

జిల్లాలో నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, వర్ని, క మ్మర్‌పల్లి, కోటగిరి, వేల్పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 12 చెక్‌పోస్టులు ఉన్నాయి. జిల్లాలోని పంటలను ఇతర జిల్లాలు, రాష్ట్రాల వ్యాపారులు, రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసి తీసుకెళ్లే క్రమంలో మార్కెటింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పసుపు, వరి, సోయా, మక్క, కూరగాయ ల అమ్మకాలు, కొనుగోళ్లతోపాటు చెక్‌పోస్టుల ద్వారా మార్కెటింగ్‌శాఖకు ఆదాయం సమకూరుతోంది.

అత్యధికంగా నిజామాబాద్‌ నుంచే..

రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్లలో నిజామాబాద్‌ వ్య వసాయ మార్కెట్‌ కమిటీ ఒకటి. జిల్లాకు నిర్దేశించుకున్న లక్ష్యంలోనూ సగానికిపైగా ఆ మార్కెట్‌దే. 2025–26వ సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా రూ. 40.36 కోట్ల మార్కెటింగ్‌ ఫీజు లక్ష్యం కాగా, అందు లో రూ.23.48 కోట్ల లక్ష్యాన్ని నిజామాబాద్‌ ఏఎంసీ పెట్టుకుంది. ప్రతి ఏడాది ఈ మార్కెట్‌ పరిధిలో సగటున 130 శాతం వరకు ఫీజు వసూలవుతోంది. సెప్టెంబర్‌ వరకు జిల్లాలో రూ.11.20 కోట్లు వసూ లు కాగా, అందులో రూ.9.97 కోట్లు నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లోనే వసూలైంది. అలాగే సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ గత యాసంగి, వానాకాలం సీజన్‌తోపాటు అంతకుముందు యాసంగి సీజన్‌లో 50 శాతం మార్కెట్‌ ఫీజు రూ.30 కోట్ల వరకు మార్కెటింగ్‌శాఖకు బకాయిలు ఉన్నాయి.

తనిఖీలు ముమ్మరం..

ప్రస్తుతం పంటల కోతల సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో మార్కెట్ల పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. చెక్‌పోస్టుల నుంచి పంట ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఇప్పటికే సెక్రెటరీలకు ఆదేశాలిచ్చారు. అయినా ధాన్యం కొనుగోళ్ల సీజన్‌, పసుపు సీజన్‌లోనే మార్కెట్‌ ఫీజు అధిక మొత్తంలో వసూలవుతుందని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

జిల్లాలో మార్కెట్‌ కమిటీల ద్వారా నిర్దేశించుకున్న ల క్ష్యాన్ని వందశాతం పూర్తి చే సేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ప్రతియేటా 125 శాతం వరకు మార్కెటింగ్‌ ఫీజు వసూలవుతుంది. ఈ సంవత్సరం కూ డా లక్ష్యాన్ని చేరుకుంటాం.

–గంగుబాయి, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం

జిల్లా మార్కెటింగ్‌ శాఖ ఈ ఏడాది ఫీజు వసూలు లక్ష్యాన్ని చేరేలా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. రూ.40.36 కోట్ల ఫీజు లక్ష్యంగా ఉండగా, గత ఆరునెలల్లో పావుశాతం మాత్రమే ఫీజు వసూలైంది. దీంతో ఉన్నతాధికారులు టార్గెట్‌ సాధించేలా ఇప్పటికే ఏఎంసీల సెక్రెటరీలకు ఆదేశాలు ఇచ్చారు.

జిల్లాలోని ఏఎంసీల ఫీజుల టార్గెట్‌ రూ.40.36 కోట్లు

ఆరు నెలల్లో పావుశాతం

మాత్రమే వసూలు

లక్ష్యం సాధనపై మార్కెటింగ్‌ శాఖ పకడ్బందీ చర్యలు

వంద శాతంపై ప్రత్యేక దృష్టి1
1/1

వంద శాతంపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement