ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం
నిజామాబాద్‌అర్బన్: ఇటీవల నేరస్తుడు రియా జ్ చేతిలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నా రు. నగరంలోని బాధిత కుటుంబాన్ని గురువా రం వారు పరామర్శించారు. కాంగ్రెస్ తరఫు న రూ.2లక్షలు అందించారు. ఈసందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయగలం కానీ, మానసికంగా జరిగిన గాయాన్ని ఎవరు పూడ్చలేదన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.


