పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి అందిస్తే బాగుంటుంది
నస్రుల్లాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి సాయం అందిస్తే బా గుంటుందని, తల్లిదండ్రులకు అప్పుల బా ధ తప్పుతుందని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో లబ్ధిదారులకు పోచారం గురువారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పె ళ్లికి మందే కల్యాణలక్ష్మి చెక్కులు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తాను తీసుకెళ్తానని, అధికారులు సైతం ఉ న్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూ చించారు. వర్ని మండలానికి చెందిన 40 మందికి, నస్రుల్లాబాద్ మండలానికి చెందిన 26 మందికి ఆయన చెక్కులను అందజేశా రు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజు, తహసీల్దార్ సువర్ణ, ఏఎంసీ చైర్మన్ శ్యామల, నాయకులు పెర్క శ్రీనివాస్, పాల్త్య విఠల్, రాము, ప్రతాప్, పు రం వెంకటి, కంది మల్లేశ్, మంగలి సాయి లు, సక్రు, పవన్‌గౌడ్, ప్రభాకర్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.
పంట మొత్తాన్ని కొనుగోలు
చేసేలా చూస్తాం
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులు పండించిన మొక్కజొన్న పంటను పూర్తిగా కొనుగోలు చే సేలా ప్రభుత్వాన్ని కోరుతామని జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవిందు అన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని మక్కల కొ నుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. నాణ్యమైన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూ చించారు. పూర్తి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఎకరానికి 18 క్వింటా ళ్ల 50 కిలోలు మాత్రమే తీసుకుంటున్నారని రైతులు డీఏవో దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఏవో మధుసూదన్ తదితరులు ఉన్నారు.
బీజేపీ నేతల పరామర్శ..
సుభాష్‌నగర్: నగరంలోని అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పరామర్శించారు. ప్రమోద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. అంతకుముందు ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు బీఆర్ శివప్రసాద్, పద్మారెడ్డి, మాస్టర్ శంకర్, కలిగోట్ గంగాధర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు నగరానికి రానున్న డివిజనల్ రైల్వే మేనేజర్
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు శుక్రవారం రైల్వే డివిజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ రానున్నారు. రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగుతున్న పనులపై విలేకరులతో సమావేశం నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఐపీఈ, ఐపీసీహెచ్) 7, 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు తెలంగాణ యూనివర్సి టీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
పెళ్లికి ముందే కల్యాణలక్ష్మి అందిస్తే బాగుంటుంది


