కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి
● ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే
తహసీల్దార్లదే బాధ్యత
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● జిల్లా అధికారులతో వీసీలో సమీక్ష
నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తహసీల్దార్లదే బాధ్యతని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల పనితీరుపై గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లు, ఏపీఎంలు, ఏ వోలు, ఏఈవోలు, ఐకేపీ కేంద్రాల ఇన్‌చార్జులు వీసీ లో పాల్గొనగా, మోస్రా తహసీల్దార్ కార్యాలయం నుంచి వీసీలో ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. ధా న్యం కొనుగోళ్ల కోసం జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్‌ను అభినందించారు. రుద్రూర్ మండలంలో కొన్ని కొనుగోలు కేంద్రాలకు రైస్‌మిల్లులతో అనుసంధానం చేయలే దని ప్రస్తావించగా, గురువారం టాగింగ్ చేశామని కలెక్టర్ తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. సంబంధిత శాఖలతో సమన్వయాన్ని పెంపొందించుకుని ధాన్యం విక్రయంలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు వీలుగా అనువైన ఖాళీ స్థలాలను గుర్తించి రైతులకు తెలియజేయాలన్నారు. వచ్చే రెండ్రోజు ల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని నిర్దేశిత ప్రాంతాలలో ధా న్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని ఆదేశించా రు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఆర్‌డీవో సాయాగౌడ్, డీఎస్‌వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ గంగుబాయి, డీసీవో శ్రీనివాస్, డీఏవో గోవిందు తదితరులు పాల్గొన్నారు.


