జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి
నిజామాబాద్ సిటీ : జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతున్నామని, పారిశ్రామికంగా, విద్య, వైద్య, క్రీడా, ఫార్మా, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం సహకారంతో జిల్లాకు కోట్లాది రూపాయల నిధులు తెస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కేంద్రం నిధు ల జాప్యంతోనే రైల్వే పనుల్లో ఆలస్యం జరుగుతోందని, వాస్తవాలు తెలుసుకునే తాను మాట్లాడానని, ఎంపీ అర్వింద్ ఈ విషయం గమనించాలన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీ..
రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలుస్తారని మహేశ్ గౌడ్ ధీ మా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్ర తిరోజు కాంగ్రెస్ పార్టీని, సీఎంను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మంత్రుల మధ్య సమస్యలను పరిష్కరించామన్నారు. మళ్లీ జరిగే కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు స్థానం కలిపిస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ జిల్లాకు రూ.518 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. గతంలో కవిత ఎంపీగా జిల్లాలో అభివృద్ధి పనులు చేయలేదని వి మర్శించారు. సమావేశంలో నుడా చైర్మన్ కేశవేణు, పీ సీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ ఉన్నారు.
కేటీఆర్‌వి అవగాహన లేని మాటలు
మంత్రుల మధ్య సమస్యలను
పరిష్కరించాం
కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు అవకాశం
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్


