నియామకం సక్రమమేనా?
నిజామాబాద్‌నాగారం: ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌లో ఇటీవల డిస్ట్రిక్ మేనేజర్ పోస్టును కనీస నిబంధనలు పాటించకుండా భర్తీ చేసినట్లు ఆరోపణ లు వస్తున్నాయి. నియామక తతంగాన్ని రహస్యంగా నడపడంతో పోస్టు భర్తీ సక్రమంగానే జరిగిందా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
మొదట రెండు.. తర్వాత నాలుగు..
నిజామాబాద్ డీఎం పోస్టు ఖాళీ ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని ఆరో గ్యశ్రీ ట్రస్ట్‌కు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. వారి లో అర్హత ఉన్న ఒకరితో పోస్టు భర్తీ చేయాలని నిజామాబాద్ కలెక్టరేట్‌కు ట్రస్ట్ నుంచి మే నెలలో ఆదేశా లు వచ్చాయి. అయితే కలెక్టరేట్‌లో పని చేసి రిటైర్డు అయిన ఉద్యోగి ఒకరు తనకు సంబంధించిన వారి కి పోస్టు ఇవ్వడానికి చక్రం తిప్పినట్లు సమాచారం. దీంతో భర్తీ ప్రక్రియను 5 నెలల వరకు పెండింగ్‌లో పెట్టి మరో రెండు దరఖాస్తులను తీసుకున్నారు. మొత్తం 4 దరఖాస్తులు ఉండగా, అభ్యర్థులకు కనీసం రాత పరీక్ష లేకుంటే, ఇంటర్వ్యూ అయినా చేపట్టి డిస్ట్రిక్ట్ కమిటీ నియామకం చేయాల్సి ఉంటుంది. కాగా ఎవ్వరిని కూడా పిలిచిన సందర్భాలు లేవు. ఏ విషయాలు పరిగణనలోకి తీసుకొని నియామకం పూర్తి చేశారో కూడా తెలియడంలేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఆరోగ్య శ్రీ ఇన్‌చార్జి కో–ఆర్డినేటర్ స్వప్నను ఫోన్‌లో సంప్రదించగా, డీఎం పోస్టును డిస్ట్రిక్ట్ కమి టీ ద్వారా కలెక్టరేట్‌లోనే భర్తీ చేశామన్నారు. ఏదైనా ఉంటే కలెక్టర్ సీసీతో మాట్లాడి చెబుతానన్నారు.
● ఇటీవల ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో
జిల్లా మేనేజర్ పోస్టు భర్తీ
● కనీస నిబంధనలు పాటించలేదనే
ఆరోపణలు


