మాక్లూర్ కేజీబీవీ తనిఖీ
మాక్లూర్: మాక్లూర్ మండల కేంద్రంలోని కేజీబీవీని గురువారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. వంట గదిలోని సరుకులను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థినులతో మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అక్కడే ఉన్న ఏఈ ఉదయ్ కిరణ్‌ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గొట్టిముక్కలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి ఎంత ధాన్యం సేకరించారని సంబంధిత అధికారిని అడుగగా సరైన సమాధానం లేకపోవటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో బ్రహ్మనందం తదితరులు ఉన్నారు.
కోటగిరిలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు


