మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మద్యానికి బానిసైన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్‌గౌడ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాండూర్‌కు చెందిన దాకమొల్లి సంగయ్య, ఎల్లవ్వకు ఇద్దరు కుమారులు నాగరాజు, కుమార్(18) ఉన్నారు. పెద్దకుమారుడైన నాగరాజు హైదరాబాద్‌లో ఉంటుండగా చిన్నాకుమారుడు కుమార్ గ్రామంలో తల్లితండ్రులతో కలిసి ఉంటున్నాడు. కొంత కాలంగా కుమార్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


