ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Oct 24 2025 2:17 AM | Updated on Oct 24 2025 2:38 AM

ధాన్య

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి హైకోర్టు ఉత్తర్వులతో విధుల్లో చేరిన సొసైటీ చైర్మన్‌ జిల్లా స్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఎంపిక బెటాలియన్‌లో ఓపెన్‌ హౌస్‌ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి

సుభాష్‌నగర్‌: జిల్లావ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సేకరణను వేగవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన కలెక్టర్‌కు లేఖ రాశారు. జిల్లాలో మొక్కుబడిగా కేంద్రాలను ప్రారంభించారని, చాలా కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతులను ప్రకృతి తీవ్రంగా కంటతడి పెట్టించిందని, అధిక వర్షాల ప్రభావంతో పంటకు కంకినల్లి, సుడిదోమ వంటి తెగుళ్లు సోకిందని తెలిపారు. ఈ తెగుళ్ల వల్ల పంట దిగుబడిపై ప్రభావం పడిందని రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌చేశారు. కోతలు పూర్తి చేసుకుని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా.. కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు, కూలీలు, గన్నీ సంచుల కొరత లేకుండా సరైన ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వేల్పూర్‌: మండలంలోని పడగల్‌ సొసైటీ చైర్మన్‌గా యాల్ల హన్మంత్‌రెడ్డి కొనసాగింపునకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుతో గురువారం ఆయ న విధుల్లో చేరారు. సొసైటీ చైర్మన్ల పదవీకా లం మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పడగల్‌ సొసైటీ చైర్మన్‌కు పొడిగింపు ఇవ్వలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.రెండు వారాల క్రిత మే హైకోర్టు అందరు చైర్మన్లతోపాటు తన పదవీకాలం కూడా ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్త ర్వు ఇచ్చిందని వెల్లడించారు. కానీ జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌ హైకోర్టు ఉత్తర్వును ఒప్పుకుంటున్నట్లు గాని, తిరస్కరిస్తున్నట్లు గాని ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. దీంతో హైకోర్టు ఉత్తర్వు ఆధారంగా తానే స్వయంగా విధుల్లో చేరినట్లు విలేకరులకు వెల్లడించారు.

నిజామాబాద్‌ నాగారం: నిజామాబాద్‌ జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ ప్రాంగణంలో గురువారం నిర్వహించినట్లు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి విజయ్‌కాంత్‌ రావు తెలిపారు. ప్రతిభ కనబర్చి న క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు త్వర లో పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాల ఫాదర్‌ జొయెస్‌ థామస్‌, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి పవన్‌ కుమార్‌, మీసాల ప్రశాంత్‌, సైక్లింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు అఫ్సర్‌, దుర్గా మల్లేశ్‌, గడ్డం రవి, నరేశ్‌, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడో బెటాలియన్‌ డిచ్‌పల్లిలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం అడిషనల్‌ కమాండెంట్‌ సీహెచ్‌ సాంబశివరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల, విక్టరీ హైస్కూల్‌, విద్యా హైస్కూల్‌ విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ కేపీ శరత్‌కుమార్‌, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌, ఆర్మూర్‌ బోధన్‌ డివిజన్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు సీపీ సాయిచైతన్య గురువారం తెలిపారు. డ్రగ్స్‌ నివారణలో పోలీసుల పాత్ర అనే అంశంపై ఆరు నుంచి డిగ్రీ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. పోటీల్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని ప్రతిభ చాటారు.

కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ అదృశ్యం

కామారెడ్డి క్రైం: అప్పులు పెరగడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి తాను చనిపోవాలని అనుకుంటున్నానని ఇంట్లో లేఖ రాసి పెట్టి అదృశ్యమైన ఘటన జిల్లా కేంద్రంలోని ఎన్జీవోఎస్‌ కాలనీలో గురువారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన బోడ చంద్రశేఖర్‌ మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 3 న ఉదయం కూరగాయల మార్కెట్‌ కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన చంద్రశేఖర్‌ తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వా త అతని పుస్తకంలో ఓ లేఖ ఉన్నట్లు గుర్తించారు. తల్లి కళావతి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లను  వేగవంతం చేయాలి 1
1/3

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను  వేగవంతం చేయాలి 2
2/3

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను  వేగవంతం చేయాలి 3
3/3

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement