పసుపు రైతుల అభ్యున్నతికి విజ్ఞానయాత్రలు అవసరం
సుభాష్‌నగర్: పసుపు రైతుల అభ్యున్నతికి విజ్ఞానయాత్రలు ఎంతో అవసరమని జాతీయ పసుపు బో ర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలోని గుంటూరు, నంద్యాల జిల్లాల నుంచి రైతులు పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధిపై వి జ్ఞాన యాత్రలో భాగంగా నగరంలోని జాతీయ ప సుపు బోర్డు కార్యాలయాన్ని గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉత్పత్తి వ్యయం, మార్కెట్‌లో ధరల అస్థిరత, పంట సంరక్షణలో ఎదురయ్యే సవాళ్లు వంటి అంశా లపై చర్చించి, వాటికి సరైన పరిష్కార మార్గాలపై చర్చించారు. అనంతరం పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు రైతుల సంక్షేమం కోసం బోర్డు నిరంతరం పని చేస్తుందన్నారు. శాసీ్త్రయ పద్ధతుల్లో పసు పు పంట ఉత్పత్తిని పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
పసుపు పరిశోధన కేంద్రం సందర్శన
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని స్పైస్ బోర్డు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా మహానంది ప్రాంత రైతులు గురువారం సందర్శించారు. పరిశోధన స్థానంలో చేపడుతున్న పరిశోధనలు, పసుపు రకాలు, యంత్రాల గురించి రైతులకు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ వివరించారు. పసుపు సాగు గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. పసుపు రకాలు, కుర్కుమిన్ శాతం, దిగుబడి, పంట కాలపరిమితి, యాజమాన్య పద్ధతులను వివరించారు. సాగవుతున్న వివిధ రకాల పసుపు పంటలను, సాగుకు వినియోగించే యంత్రాలను పరిశీలించి, వాటి పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది, రైతులు ఉన్నారు.
పసుపు రైతుల అభ్యున్నతికి విజ్ఞానయాత్రలు అవసరం


