వ్యవసాయ కళాశాల జిల్లాకు వరం
● ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి
సుభాష్‌నగర్: అన్నపూర్ణ జిల్లాగా పేరున్న నిజామాబాద్‌కు వ్యవసాయ కళాశాల వరమని, ఈ కళాశాల ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చినట్లు అవుతోందని ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకు వ్యవసాయశాఖ మంజూరు చేసినందుకుగాను రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ఆయన గురువారం హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందులోభాగంగానే జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే జిల్లాలో అన్నదాతలు పండిస్తున్న పసుపు, వరి, సోయా, మొక్కజొన్న, ఎర్రజొన్నలు, తదితర పంటలు వేరే జిల్లాలు, రాష్ట్రాలతోపా టు ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా రైతులు, విద్యార్థులు రుణపడి ఉంటారని మంత్రికి తెలిపారు.


