
నాణ్యతపై నిఘా ఏదీ?
న్యూస్‌రీల్
నిజామాబాద్
ఫిర్యాదులను సత్వరమే..
ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులకు సూచించారు.
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
– 10లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆహార పదార్థాలతోపాటు బంగారం, వెండి ఆభరణాలు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, కార్లు, బైక్స్ తదితర ఆటోమొబైల్స్, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సిమెంట్, స్టీల్ తదితర ఇతర అన్నిరకాల వస్తువులకు సంబంధించి ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’(బీఐఎస్) నిర్దేశించిన మేరకు నాణ్యతాప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందరికీ ప్రియమైన, ప్రస్తుతం రోజురోజుకూ భారీగా ధర పెరుగుతున్న బంగారం విషయానికి వస్తే హెచ్‌యూఐడీ (హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్) నంబరు విషయంలో మాయాజాలం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో, దేశంలోనూ ఈ ప్రమాణాలు పాటించడం సంగతి అటుంచితే.. ఇందుకు సంబంధించి నిఘా పెట్టే వ్యవస్థ సక్రమంగా పనిచేయలేని పరిస్థితి. ప్రతి రాష్ట్రంలో ఒక్కచోట మాత్రమే ఉండే బీఐఎస్ కార్యాలయాలకు తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో ఇన్స్‌పెక్షన్లు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో తగిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవు. దీంతో నాణ్యతా ప్రమాణాల విధానాలు ఆశించినవిధంగా అమలు కావడం లేదు. అక్టోబర్ 14 అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం నేపథ్యంలో కథనం..
అన్నిరకాల వస్తువులకు సంబంధించి నాణ్యత పరంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రమాణాలు (స్టాండర్డ్స్)ను నిర్ణయిస్తుంది. ఈ మేరకు ఆయా వస్తువుల అమ్మకాలు చేపట్టాలి. అప్పుడే వినియోగదారులకు ఆర్థికపరంగా, ఆరోగ్యరీత్యా రక్షణ ఉంటుంది. అన్నింటిలో ఖరీదైన, పెట్టుబడి వస్తువుగా ఉన్న బంగారు ఆభరణాలకు ప్రమాణాలతోపాటు ఆరు అంకెల హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యుఐడీ)ని తప్పనిసరిగా ముద్రించాలి. ఈ నంబర్ రసీదుపైనా ఉండాలి. అయితే ఈ ప్రమాణాల విధానం సరైనదే అయినప్పటికీ అమలులో లోపాల కారణంగా వినియోగదారులు నిరంతరం మోసపోతూనే ఉన్నారు. ప్రమాణాల అమలుపై బీఐఎస్ విభాగానికి సంబంధించి రాష్ట్రంలో ఒక్క కార్యాలయం మాత్రమే ఉండడంతోపాటు తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో తనిఖీలు చేసే పరిస్థితి లేదు. దీంతో ప్రమాణాలు సరిగానే అమలు చేస్తున్నారా? లేదా? అని పర్యవేక్షించే పరిస్థితి లేదు. మరోవైపు వినియోగదారులకు ప్రమాణాల విషయమై అవగాహన లేకపోవడంతో ముఖ్యంగా బంగారు ఆభరణాలపై లోపాలతో కూడిన నకిలీ ముద్రలు, ఇతర వస్తువులపై అసలు ముద్రలే (బీఐఎస్, ఐఎస్‌ఐ) లేకపోవడంతో దారుణంగా మోసపోతున్నారు. తెలంగాణలో బంగారు ఆభరణాలపై హెచ్‌యూఐడీ ప్రమాణాల ముద్రలు వేసే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతించిన 22 హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో 16 కేంద్రాల లైసెన్సులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఇక దేశవ్యాప్తంగా 546 హాల్‌మార్కింగ్ కేంద్రాల లైసెన్సులు రద్దు చేయడం గమనార్హం. ఈ లైసెన్సులు కలిగి ఉన్న కేంద్రాలు ముద్రలు వేసే విషయంలో అనేక అవకతవకలకు పాల్పడడంతో వాటిని రద్దు చేశారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒక్కోటి మాత్రమే ఉన్న బంగారం హాల్‌మార్క్ కేంద్రాల లైసెన్సులు రద్దు చేయడంతో వినియోగదారులకు ముద్రలు లేకుండానే అమ్మకాలు చేస్తున్నారు. కచ్చితమైన ప్రమాణాల నిబంధనలు ఉన్నప్పటికీ వినియోగదారులు మోసపోతున్న పరిస్థితి.
మనం వాడే, మనకు అవసరమైన వస్తువుకు ప్రాముఖ్యత దాని నాణ్యతాప్రమాణంపై ఆధారపడి ఉంటుంది. మరి వస్తువు నాణ్యతాప్రమాణాల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విధానాలు సూచించినప్పటికీ అమలు మాత్రం అంతంతగానే ఉండటం గమనార్హం. అతి విలువైన బంగారం కొనుగోళ్ల సందర్భంగా వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు.
ప్రమాణాల విధానాలు సరే..
అమలు అంతంతేనా..?
గృహోపకరణాలు, ఆటోమొబైల్స్, సిమెంట్, స్టీల్ తదితరాల ప్రమాణాలపై లేని పట్టింపు
అందరికీ ప్రియమైన బంగారంలో అనేక లోపాలు
హెచ్‌యూఐడీలో మాయాజాలం
అక్టోబర్ 14 అంతర్జాతీయ
ప్రమాణాల దినోత్సవం

నాణ్యతపై నిఘా ఏదీ?