
ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లు
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
నిజామాబాద్ అర్బన్ : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ సజావుగా సాగేలా విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం సేకరణపై సమీక్షించారు. జిల్లాలో ధాన్యం సేకరణ ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ మంత్రులకు వివరించారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో ధాన్యం దిగుబడులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 274 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. గత సీజన్ లో 606 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి 676 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లాకు 1582 అదనపు టార్పాలిన్లు కేటాయించాలని కలెక్టర్ కోరారు. వీసీ అనంతరం ధాన్యం సేకరణపై కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్‌వో అరవింద్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, డీసీవో శ్రీనివాస్, డీటీవో ఉమామహేశ్వర్ రావు, మార్కెటింగ్ ఏడీ గంగవ్వ, తూనికలు కొలతల శాఖ అధికారి సుజాత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ పనులను కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాధవనగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ) పనులతోపాటు ఖలీల్‌వాడిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, అహ్మదీబజార్ వద్ద ఖిల్లా రోడ్డును ఆనుకుని అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, 80 క్వార్టర్స్, కలెక్టరేట్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో పనులపై సమీక్షించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, హౌసింగ్ డీఈ నివర్తి, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజు తదితరులున్నారు.
పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘా
జిల్లాకు అదనంగా
టార్పాలిన్లు కేటాయించండి
వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రులతో
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లు