మక్క కొనుగోళ్లకు పచ్చ జెండా | - | Sakshi
Sakshi News home page

మక్క కొనుగోళ్లకు పచ్చ జెండా

Oct 16 2025 5:07 AM | Updated on Oct 16 2025 5:07 AM

మక్క కొనుగోళ్లకు పచ్చ జెండా

మక్క కొనుగోళ్లకు పచ్చ జెండా

మంత్రి తుమ్మలకు లేఖ రాశా ఆదేశాలు అందాయి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : మొక్కజొన్న కొ నుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో గురువారం నుంచి స హకార సంఘాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోళ్లను ప్రారంభించాలని మార్క్‌ఫెడ్‌ అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అందా యి. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే సుకోవాలని సహకార సంఘాలకు సూచనలు వచ్చాయి. దీంతో బుధవారం కలెక్టరేట్‌లో అద నపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మా ర్క్‌ఫెడ్‌ అధికారులు సొసైటీల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొక్కజొన్న పంట దిగుబడులను రైతుల నుంచి పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో మొత్తం 26 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించి రైతులకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,400 దక్కేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. కాగా జిల్లాలో ఈ సీ జన్‌లో 52,093 ఎకరాల్లో మొక్కజొన్నను రైతు లు సాగుచేశారు. పంట కోతలు మొదలై మూ డు వారాలు దాటింది.

అయితే మక్క కొనుగోలు కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం ఆలస్యం చేయడంతో 40 శా తం పంటను రైతులు ఇప్పటికే ప్రైవేటు వ్యాపా రులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రతికూల వా తావరణం నేపథ్యంలో పలువురు రైతులు తక్కు వ ధరకే అమ్ముకున్నారు. ఈ క్రమంలో తాజాగా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండడంతో పంట చేతిలో ఉన్న రైతులు తమకు మద్దతు ధర దక్కనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గు రువారం నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో రైతులు మొ క్కజొన్న సాగు చేశారు. జిల్లాలోనే ముందుగా పంట చేతికి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు లే కపోవడంతో రైతులు దళారులకు రూ.1900కే అమ్ముకున్నారు. దీంతో మార్క్‌ఫెడ్‌ ద్వారా మ క్క కొనుగోళ్లు చేయాలని కోరుతూ గత నెల 23 వ తేదీన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశా. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లకు ఎమ్మెల్యే లు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్‌ భూపతిరెడ్డి చొరవ తీ సుకున్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను స ద్వినియోగం చేసుకోవాలి. – ఎస్‌. అన్వేష్‌రెడ్డి,

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే సమాచారాన్ని సహకార సంఘాలకు చేరవేశాం. గురువారం మొదట గా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిలో కొ నుగోలు కేంద్రం ప్రారంభించనున్నాం. జి ల్లాలో 26 చోట్ల వీటిని ఏర్పాటు చేయను న్నాం. రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధరను పొందాలి.

– మహేశ్‌కుమార్‌,

మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌

మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు

జిల్లాలోని 26 సహకార సంఘాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

నేటి నుంచి ప్రారంభం

కానున్న కొనుగోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement