
శిక్షణ కేంద్రంలో సౌకర్యాలను మెరుగుపర్చాలి
బోధన్ : పోలీసు ట్రెయినింగ్ సెంటర్‌లో సౌ కర్యాలు, వసతిని మరింత మెరుగుపర్చాల ని సంబంధిత అధికారులను సీపీ సాయిచైత న్య ఆదేశించారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామశివారులోని జిల్లా పోలీస్ శిక్ష ణ కేంద్రాన్ని సీపీ సోమవారం సందర్శించా రు. కేంద్రం పరిసరాల్లో కలియదిరిగారు. గ దులు, వంటశాల, నీటిసరఫరా, మరుగుదొడ్లు, అవుట్ డోర్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ పరిశీలించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, శిక్షణా కేంద్రం ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.
వైన్ షాపులకు
232 దరఖాస్తులు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని 102 మ ద్యం దుకాణాలకు ఇప్పటి వరకు మొత్తం 232 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. సోమవారం 83 దరఖాస్తులు అందాయని, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం
ఖలీల్‌వాడి : డైట్ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన అతిథి అధ్యాపక పోస్టుల (గెస్ట్ లెక్చరర్)భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయానికి అభ్యర్థుల వయస్సు 65 సంవత్సరాల లోపు ఉండాలని, రిటైర్డ్ లెక్చరర్లు, టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంగ్లిష్, తెలుగు మీడియంలో ఫిలాసఫీ, సోషి యాలజీ సబ్జెక్టుల్లో ఒక పోస్టు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఒక పోస్టు, ఉర్దూ మీడియంలో రెండు పోస్టులు మ్యాథమేటిక్స్, ఫిలా సఫీ/సోషియాలజీ/సైకాలజీ సబ్జెక్ట్స్‌లో ఖా ళీలు ఉన్నాయని వివరించారు. అభ్యర్థు లు సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంఎడ్ అర్హత కలిగి ఉండాలని సూచించారు. ఎంఎడ్ అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో సంబంధిత సబ్జెక్టుకు బీఎడ్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు కళాశాలలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్పత్తిలో డెమో, ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.
రేపు జాబ్ మేళా
నిజామాబాద్ నాగారం: నిరుద్యోగులకు ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు బుధవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీపీ మధుసూదన్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్‌మేళా ద్వారా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డు, సలహాదారు, క్యాషియర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఏదైనా డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నిజామాబాద్‌నగరంలోని శివాజీనగర్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం వరకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. ఇతర వివరాలకు 99594 56793, 99487 48428, 63057 43423 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
పోలీస్ సిబ్బందికి
ఉలెన్ జాకెట్లు పంపిణీ
నిజామాబాద్‌అర్బన్: ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి సీపీ సాయిచైతన్య సోమవారం త న కార్యాలయంలో ఉలెన్ జాకెట్లు, హవర్ సాక్సులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా అందజేశామని, సిబ్బంది ఉలెన్ జాకెట్లు, హవర్ సాక్సు లు తమ వెంట ఉంచుకుని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌రెడ్డి, ఆర్‌ఎస్సైలు నిశిత్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.