బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం | - | Sakshi
Sakshi News home page

బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం

Oct 14 2025 6:51 AM | Updated on Oct 14 2025 6:51 AM

బీసీ

బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం

బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం వాల్‌ పోస్టర్ల ఆవిష్కరణ మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు

నిజామాబాద్‌ నాగారం: నగరంలోని గీతాభవన్‌లో సోమవారం బీసీ కమిటీల అన్ని సంఘాలు, జేఏసీ రాష్ట్ర కమిటీ సూచన మేరకు జిల్లా కమిటీని నియమించినట్లు నాయకులు రేవంత్‌ తెలిపారు. జిల్లా చైర్మన్‌గా పోతనకార్‌ లక్ష్మి నారాయణ, కో–చైర్మన్‌గా బొబ్బిలి నర్స య్య నియమితులయ్యారు. ప్రతి కుల సంఘం నుంచి ఒక ప్రతినిధిని కో–కన్వీనర్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. బీసీ నాయకులు నాగరాజ్‌, సభ్యులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌నాగారం: నగరంలోని కలెక్టరేట్‌లో సోమవారం జాతీయ పోషణ మాసోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను అడిషనల్‌ కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 16 వరకు జరిగే పోషన్‌ మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని, విజయవంతం చేయాలన్నారు. ట్రెయినీ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్తియాన్‌ మావి, జిల్లా సంక్షేమాధికారిణి రసూల్‌బీ తదితరులు పాల్గొన్నారు.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో మక్క కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిల భార త రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు సోమవారం జిల్లా కేంద్రంలోని మార్క్‌ఫెడ్‌ డీఎం దాసోజు మహేశ్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో మక్క కోత లు మొదలై 20 రోజులైనా ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాల ని కోరారు. నాయకులు సాయిరెడ్డి, ఆకుల పా పన్న, సాయిలు, దేవన్న, గంగాధర్‌, మోహన్‌ తదితరులు ఉన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ 2వ సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్టు అకాడమిక్‌ ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో జరిగిన పరీక్షకు మొత్తం 29 మంది అభ్యర్థులకు గాను అందరూ హాజరయ్యారైనట్లు ఆయన తెలిపారు.

పోతన్‌కర్‌

లక్ష్మీనారాయణ

బొబ్బిలినర్సయ్య

బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం 
1
1/3

బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం

బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం 
2
2/3

బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం

బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం 
3
3/3

బీసీ జేఏసీ జిల్లా కమిటీ నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement