
ముగిసిన ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి టోర్నమెంట్
నిజామాబాద్ నాగారం: నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానం కొనసాగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ఈసందర్భంగా జిల్లాస్థాయి అండర్ 17 వాలీబాల్, అండర్ 14 కబడ్డీ బాలబాలికల పోటీలలో 16 జోన్ల బాలబాలికల జట్లు పాల్గొనగా ప్రతిభ చూపిన వారిని తదుపరి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి తెలిపారు. అండర్ 17 వాలీబాల్ బాలుర విభాగంలో నందిపేట జోన్ ప్రథమ స్థానం, డిచ్‌పల్లి జోన్ ద్వితీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో ఆర్మూర్ రూరల్ జోన్ ప్రథమ స్థానం, డిచ్‌పల్లి జోన్ ద్వితీయ స్థానం సాధించింది. అండర్ 14 కబడ్డీ బాలుర విభాగంలో భీమ్‌గల్ రూరల్ జోన్ ప్రథమ స్థానం, ఆర్మూర్ రూరల్ జోన్ ద్వితీయ స్థానం సాధించింది, బాలికల విభాగంలో నిజామాబాద్ అర్బన్ జోన్ ప్రథమ స్థానం, నందిపేట్ జోన్ ద్వితీయ స్థానం సాధించింది. విజేతలకు బహుమతులు అందజేశారు. డీవైఎస్‌వో పవన్ కుమార్, విద్యాసాగర్‌రెడ్డి, గోపిరెడ్డి, రాజేందర్, అమరవీర్ రెడ్డి, కస్తూరి శ్రీనివాస్, రాజరాజేశ్వర్, ప్రసాద్, అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు.